Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..

Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 25, 2024, 07:44 PM IST
  • సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్..
  • హైడ్రాకు పై పిల్..
Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..

Pil against hydra in Telangana high court: తెలంగాణలో హైడ్రా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సైతం హైడ్రాకు  ఇటీవల ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చారు. దీనికి విశేష అధికారాలను సైతం కట్టబెట్టారు. ముఖ్యంగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి చేర్చింది. మరోవైపు.. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా.. ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు కట్టబెట్టినట్లు తెలుస్తొంది.

ఈ క్రమంలో హైడ్రా మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తొంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం.. తనకు లభించిన విశేష అధికారాలతో జీహెచ్ఎంసీ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. హైడ్రా కు అనుకొని విధంగా ట్విస్ట్ ఎదురైనట్లు తెలుస్తొంది.

సీఎం రేవంత్  ముఖ్యంగా హైడ్రా ను.. చెరువులు, నాలాలు, బఫర్ జోన్ , ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమనిర్మాణాల్ని కూల్చేసేందుకు హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రాపై ప్రస్తుతం రాజకీయంగా రచ్చ కూడా నడుస్తొంది. హైదరబాద్ లో చెరువులు, నాలాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కు..హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

హైడ్రాకు విశేష అధికారాలను కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టానికి పూర్తిగా విరుద్ధమని.. మాజీ కార్పొరేటర్, పిటిషనర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాశంగా మారింది.

Read more: KTR Vs Ponguleti: ఏ పీక్కుంటావో పీక్కో..?.. మంత్రి పొంగులేటీ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

మూసీ నది సుందరీ కరణలో కూడా, పరిసర ప్రాంతాలలో ఉన్ననిర్మాణాల కూల్చివేతల్ని పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు నుంచి హైడ్రాకు నోటీసులు రావడం మాత్రం వార్తలలో నిలిచింది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News