New CoronaVirus Strain: కొత్త వైరస్‌ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల రాజేందర్

New CoronaVirus Strain: కరోనా వైరస్ తర్వాత ప్రస్తుతం పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. అయితే దీనిపై ఆందోళన అక్కర్లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 29, 2020, 06:15 PM IST
  • కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది
  • పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం
  • ఈ నేపథ్యంలో ఊరట కలిగించే వార్త చెప్పిన మంత్రి ఈటల
New CoronaVirus Strain: కొత్త వైరస్‌ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల రాజేందర్

New CoronaVirus Strain:  కరోనా వైరస్ తర్వాత ప్రస్తుతం పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. అయితే కొత్త రకం వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం అని ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

అందులో ముఖ్యంగా గత నెల రోజుల నుంచి దాదాపు 33వేలకు పైగా ప్రయాణికులు బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చినట్లు సమాచారం. బ్రిటన్‌లో ఉన్న కొత్త రకం కరోనా వైరస్ కేసులు 6 భారత్‌లో గుర్తించారు. బెంగళూరులో 3, హైదరాబాద్‌లో 2, మరో ప్రాంతంలో ఇంకో కొత్త కరోనా వైరస్ కేసును గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajenderమీడియాతో మాట్లాడారు. 

Also Read: Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ భయంకరమైనది కాదని ఊరట కలిగించే వార్త చెప్పారు. స్ట్రెయిన్‌కు మనుషుల ప్రాణాలు తీసేంత ఎక్కువ శక్తి లేదని వెల్లడించారు. అయితే కొత్త రకం కరోనా వైరస్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారని ప్రస్తావించారు. అందుబాటులో ఉన్న పాత పద్దతిలోనే ప్రస్తుతం కొత్త వైరస్ బాధితులకు సైతం చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు.

Also Read: Export Of Onions from January 1st: ఉల్లిపాయ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

రాష్ట్రంలోనూ గత 10 నెలలుగా ప్రజలు కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి భయంతో ఉన్నారని, ఇంకా మీడియా, సోషల్ మీడియాగానీ ప్రజలను మరింత భయ పెట్టవద్దు అని సూచించారు. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కనుక రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఈటల హెచ్చరించారు. 

Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే!

కరోనా వైరస్, స్ట్రెయిన్ వైరస్‌లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సమయంలో తమకు పండుగులు, వేడుకల కన్నా ప్రాణాలు ముఖ్యమని గ్రహించి నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండి ఇంగ్ల సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ పదే పదే సూచించారు. 

Also Read: Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News