TG DSC 2025 Notification: తెలంగాణలో వరుసగా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. గత ఏడాది టెట్ పరీక్ష ఆ తరువాత డీఎస్సీ నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు మరో డీఎస్సీకు సిద్ధమైంది. గత ఏడాది 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించగా ఇప్పుడు మరో 6 వేల పోస్టులు భర్తీ చేయనుంది.
తెలంగాణలో గత ఏడాది మెగా డిఎస్సీ కోసం అభ్యర్ధుల నుంచి డిమాండ్ వచ్చినా సాధ్యం కాకపోవడంతో 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించింది. త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని అభ్యర్ధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నచ్చజెప్పారు. ఫిబ్రవరి నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్ని విద్యాశాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన డీఎడ్, బీఎడ్ అభ్యర్ధులకు లబ్ది చేకూరవచ్చు.
అయితే ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందు కొన్ని అంశాలపై క్లారిటీ రావల్సి ఉంది. రాష్ట్రంలో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ కోటా ఏ మేరకు కేటాయించాలనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఫిబ్రవరిలో వెలువరించే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ అంశాలు పరిగణలో తీసుకుంటారా లేదా అనేది స్పష్టత లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు టెట్ పరీక్ష, ఒకసారి డీఎస్సీ నిర్వహించింది. విద్యాశాఖలో ఎలాంటి ఖాళీల్లేకుండా ప్రణాళిక రచిస్తున్నారు.
తెలంగాణలో ఇటీవలే టెట్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 2 నుంచి 20 తేదీ వరకూ జరిగిన టెట్ పరీక్షలకు 2 లక్షల 5 వేలమంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రాధమిక కీ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలుంటే తెలపాలని సూచించారు. త్వరలో టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో వెలువడనున్న డీఎస్సీ నోటిఫికేషన్ లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు, ఏ కేటగరీ పోస్టుల వంటి వివరాలు త్వరలో తెలుస్తాయి.
Also read: Telangana: మరోవారం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలెర్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి