Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  

Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా దేవాలయ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 26, 2024, 08:50 AM IST
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  

Telangana Government Key Decision: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కేవలం విజయా డైరీని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నీ ఆలయాల్లో ఇకపై ప్రసాదాల తయారీకి ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన నెయ్యిని ఉపయోగిస్తే ఉపక్షించేది లేదని చెప్పింది. ఏ టెండర్లు నిర్వహించకుండా కేవలం విజయ డైరీ మాత్రమే ఉపయోగించాలని ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అన్నీ దేవాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో 12 దేవాలయాలకు ఏటా కోటీ రూపాయాల ఆదాయం లభిస్తుంది. 20 దేవాలయాలు 50 లక్షలు మరో 325 దేవాలయాలు 24 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించడానికి కల్తీకి చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రస్తుతం విజయ డైరీ నష్టాల్లో కూడా ఉంది. ఈ నిర్ణయంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని కృషి చేస్తుంది. విజయ డైరీకి రైతులు పాలను విక్రయిస్తున్నారు. ఇంకా రైతులను నుంచి పాలను కొనుగోలును పెంచే యోచనలో ఉందట. విజయ డైరీని ఇక లాభాల్లో తీసుకువస్తున్నారు.

ఇదీ చదవండి: దండం రా బాబు.. చెత్తను పక్కనే ఉన్న బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి.. అయినా కానీ..

ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దేవాలయాలు పాటిస్తాయి? అనే సందేహం కూడా ఉంది. ముఖ్యంగా చిన్న దేవాలయాలు ఏ మార్గంలో వెళ్తాయి తెలీదు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించడానికి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద దేవాలయాలు టెంటర్లు ఆహ్వానిస్తారు. చిన్న దేవాలయాలు నేరుగా సంస్థల నుంచి కొనుగోలు చేస్తారు. ఏ ఆలయం కూడా ఇప్పటి వరకు విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని కొనుగోలు చేయట్లేదట. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కీలక నిర్ణయంతో ఎంత వరకు ఆలయాలు పాటిస్తాయో చూడాలి.

ఇదీ చదవండిబిగ్‌ బిలియన్‌ డే సేల్‌ భారీ డిస్కౌంట్లతో స్మార్ట్‌ టీవీలు.. రూ. 6 వేల కంటే తక్కువ ధరలో 5 బ్రాండెడ్ టీవీలు..

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, ముఖ్యంగా ఇందులో బీఫ్‌ ఫ్యాట్‌, చేపనూనె వినియోగించారని ల్యాబ్‌ టెస్ట్‌లో తేలింది. దీన్ని అధికారికంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తమిళనాడుకు చెందిన ఏఆర్‌ నెయ్యి సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే పనిని అప్పగించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News