తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. భారీగా గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 9 వేల 168 పోస్టుల్ని భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్, లేదా మే నెలలో పరీక్షల్ని టీఎస్‌పీఎస్‌సి నిర్వహిస్తుంది.
తెలంగాణలో వివిధ శాఖల్లో 9,168 గ్రూప్ 4 పోస్టులు ఖాళీకై ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో వ్యవసాయ, సహకారశాఖలో 44, బీసీ సంక్షేమ శాఖలో 307, కన్జ్యూమర్స్ ఎఫైర్స్, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్ధికశాఖలో 255, వైద్య ఆరోగ్య శాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742,హోంశాఖలో 133, నీటి పారుదల శాఖలో 51, కార్మిక, ఉపాధి శాఖలో 128, మైనార్టీ సంక్షేమ శాఖలో 191, మున్సిపల్ శాఖలో అత్యధికంగా 2701, పంచాయితీ రాజ్ శాఖలో 1245, రెవిన్యూ శాఖలో 2077, గిరిజన సంక్షేమ శాఖలో 221 ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇతర ఖాళీలు, వయస్సు, వేతనం, అర్హత వంటి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in సందర్శించాల్సి ఉంటుంది.
Also read: YS Sharmila: మంత్రి మరదలు అంటేనే చెప్పుతో కొడతా అన్నా.. ఆయన మగతనంతో నాకేం పని: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook