Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం, రేపు రాహుల్‌తో భేటీ కానున్న పొంగులేటి, జూపల్లి

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయమే మిగిలింది. మరోసారి అధికారం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే..బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2023, 12:25 AM IST
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం, రేపు రాహుల్‌తో భేటీ కానున్న పొంగులేటి, జూపల్లి

Telangana: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకు ఊపు తెచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపించినట్టే కన్పిస్తోంది. పార్టీలో చేరికల పర్వం ప్రారంభమైంది. మాజీ కాంగ్రెస్ నేతల ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోంది. వర్గ విబేధాలు మానుకుని పనిచేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో స్వల్ప మార్పు కన్పిస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో చేరికల పర్వం మొదలవుతోంది. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్‌ను అడ్డుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే చేరికలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గద్వాలకు చెందిన జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకునేందుకు సర్వం సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరినా ఇమడలేకపోయారు. ఓ దశలో బీజేపీలో చేరతారనే ప్రచారం తీవ్రంగా సాగింది. కానీ కాంగ్రెస్ గూటికి చేరేందుకే ఆసక్తి చూపించారు. 

ఇక మరో నేత జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి కొద్దికాలానికి బీఆర్ఎస్ పార్టీలో చేరినా ఎక్కువకాలం కొనసాగలేదు. తిరిగి సొంతగూటికే చేరనున్నారు. అటు పొంగులేటి, ఇటు జూపల్లి ఇద్దరూ రేపు అంటే జూన్ 26న ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఇద్దరితో రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ముగ్గురూ కలిసి రాహుల్ గాంధీతో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం కానున్నారు. ఆ తరువాత రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన హామీలు తీసుకున్న తరువాతే కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. 

మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా పార్టీని విలీనం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వైెఎస్ షర్మిల అధికారికంగా ఏ విషయం చెప్పకపోయినా..డీకే శివకుమార్ తో ఆ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also read: Telangana EAMCET Counselling First Phase: తెలంగాణ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News