YS Jagan: జగన్ కు చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ .. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా పులివెందులు..

YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డికి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా.. ? ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ గా చేయనున్నారా.. ?  అంటే  ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు ?

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 16, 2024, 01:17 PM IST
YS Jagan: జగన్ కు చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ .. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా పులివెందులు..

YS Jagan Mohan Reddy: తాజాగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైయస్ఆర్సీపీకి అక్కడి ఓటర్లు దిమ్మదిరిగే మైండ్ బ్లాంక్ చేసే రిజల్ట్ ఇచ్చారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా స్థానం కూడా దక్కలేదు. మొత్తంగా 2019లో 151 సీట్లు కట్టబెట్టిన ఏపీ ఓటర్లు.. ఈ సారి జగన్ కు కేవలం 11 సీట్లు మాత్రమే కట్టబెట్టి బిగ్ షాక్ ఇచ్చారు. కేవలం జోడెద్దుల లాంటి సంక్షేమం, అభివృద్ధిలో కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ కు ప్రజలు  మొట్టికాయలు వేసారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి వస్తారా అనేది చూడాలి. అంతేకాదు అసెంబ్లీలో జగన్ కు ఎక్కడ సీటు కేటాయిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆ  సంగతి పక్కన పెడితే.. 2029 ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పరంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ నేతృత్వం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చాలనే ప్రయత్నాలను ఇప్పటి నుంచే చంద్రబాబు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. అంతేకాదు ఎస్సీతో పాటు ఎస్సీ మహిళాగా కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నియోజకవర్గాన్ని విడిచిపెట్టి.. కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

మరి చంద్రాబాబు నాయుడు కోరుకున్నట్టుగా పులివెందుల నియోజకవర్గం ఎస్సీ లేదా ఎస్సీ మహిళ, మహిళలకు ఈ సీటు రిజర్వ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేము అంటున్నారు.   ఒకవేళ ఈ మూడింటిలో ఏది చేసిన జగన్ వచ్చే అసెంబ్లీలో పోటీ చేయడానికి కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్ విషయానికొస్తే..  ఈ ఎన్నికల్లో ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 32 మంది గెలిస్తే.. అందులో తెలుగు దేశం పార్టీ తరుపున 24 మంది గెలిచారు. ఇద్దరు బీజేపీ, 6 గురు వైయస్ఆర్సీపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఎస్సీ మాదిగల్లో 14 మంది గెలిస్తే.. అందులో 13 మంది టీడీపీ తరుపున గెలిచారు. ఒక్కరు వైసీపీ తరుపు విజయం సాధించారు. మాల సామాజిక వర్గం వాళ్లు 15 మంది గెలిస్తే.. టీడీపీ, జనసేనల తరుపున 13, 1ఒక్కోరు చొప్పున గెలిచారు. వైసీపీ తరుపున 1 ఒక్కరే విజయం సాధించారు.
కాపు, బలిజల్లో 18 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికతే.. అందులో 9 మంది టీడీపీ, 9 మంది జనసేన తరుపున విజయం సాధించారు.
క్షత్రియులు 7 గురు విజయం సాధిస్తే.. అందులో 5 మంది టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే గెలిచారు. వైశ్య నుంచి 2, బ్రాహ్మణ నుంచి ఒక్కరు చొప్పున విజయం సాధించిన వారు కూటమి తరుపున ఉన్న వారే గెలిచారు. అటు యాదవ నుంచి 7 గురు విజయం సాధిస్తే.. టీడీపీ -5, బీజేపీ -1, వైసీపీ -1 చొప్పున గెలిచారు. తుర్పు కాపుల్లో 6 మంది ఎమ్మెల్యేలు అయితే.. అందులో 5 మంది టీడీపీ, ఒకటి జనసేన పార్టీ తరుపున ఎన్నికయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల పరంగా కూడా జగన్ కు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News