తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR ) తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి, పనులు జరగుతున్న తీరును పరిశీలించడానికి ఇవాళ ఆయన యాదాద్రికి ( Yadadri ) వెళ్లారు. సీఎం కేసీఆర్ ను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు.
-
తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం గురించి సంపూర్ణ సమాచారం మీకోనం Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్చకులు ఆయనకు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం చుట్టూ పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి కీలక సూచనలు, సలహాలు చేశారు.
- ఇంటి నుంచి పని చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? ఇది చదవండి Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు
అయితే యాదాద్రి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కు దారి పక్కనే కొన్ని కోతులు కనిపించాయి. కోతులు గుంపును చూసి సీఎం కేసీఆర్ తన కాన్వాన్ ను ఆపించి మరీ వాటికి అరటి పండ్లు అందించారు. యాదాద్రి ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద ఆయన కాన్వాయ్ దిగి తనతోబాటు తెచ్చుకున్న పండ్లను వాటికి అందించారు. ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్ హల్చల్ చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR