Telangana Cabinet Meeting: జూన్ 8న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే

Telangana Cabinet Meeting on 8th June:తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించనున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 6, 2021, 05:52 PM IST
  • జూన్ 9న తెలంగాణలో ముగియనున్న లాక్‌డౌన్ గడువు
  • జూన్ 8న సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ
  • రైతు బంధు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్న కేబినెట్
Telangana Cabinet Meeting: జూన్ 8న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే

Telangana Cabinet To meet on 8th June: తెలంగాణలో ఇటీవల పొడిగించిన లాక్‌డౌన్ జూన్ 9న ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి, థర్డ్ వేవ్ సన్నద్ధత, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూన్ 8న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.

ఇటీవల లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలోనూ సుదీర్ఘంగా తెలంగాణ మంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలు, రైతు బంధు పథకం (Rythu Bandhu scheme) నగదు పంపిణీ, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, కరోనా థర్డ్ వేవ్ కోసం ప్రభుత్వం, అధికారులు సన్నద్ధత, దాదాపు గత నెల రోజులుగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఆర్థిక పరిస్థితిపై సైతం తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet Meeting) చర్చించనుందని తెలుస్తోంది.

Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించనున్నారు. కల్తీ మందుల సమస్య లేకుండా చూసేందుకు పత్యేక చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. కాలువలు, చెరువుల పూడిక తీయడం పనుల పరిశీలన లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభం కావాల్సిన డయాగ్నస్టిక్ సెంటర్లను జూన్ 9న ప్రారంభించాలని Telangana సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: Harish Rao slams Etela Rajender: ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News