Talasani On Early Elections: ముందస్తుకు సిద్ధం.. తేల్చుకుందామా? బీజేపీకి మంత్రి తలసాని సవాల్..

Talasani On Early Elections: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 11:43 AM IST
  • అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల కౌంటర్
  • ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న మంత్రి తలసాని
  • మోడీ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని సవాల్
Talasani On Early Elections: ముందస్తుకు సిద్ధం.. తేల్చుకుందామా? బీజేపీకి మంత్రి తలసాని సవాల్..

Talasani On Early Elections: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్న మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు.. కమలం నేతలకు స్ట్రాంగ్ కౌంటరిస్తున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు బండి సంజయ్ ఒక్కడు చాలన్న అమిత్ షా కామెంట్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చాలైతే.. అమిత్ షా తెలంగాణలో ఏం పీకడానికి వచ్చారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

అమిత్ షా ఆరోపణలకు ధీటుగా కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్రం తెలంగాణ చేసిందేమి లేదన్నారు తలసాని. మోడీ, అమిత్ షాలు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళితే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు బీజేపీ సిద్ధమా అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఎవరొచ్చినా కేసీఆర్ ను ఏం చేయలేరని చెప్పారు. రాహుల్ గాంధీ, అమిత్ షాలను పర్యాటకులతో పోల్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ వస్తున్న టూరిస్టులు తెలంగాణకు ట్యాక్స్ కడుతున్నారంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణలో బీజేపీకి అన్ని సీట్లలో అభ్యర్థులు కూడా లేరన్నారు తలసాని. టీఆర్ఎస్ తో ఎవరితోనూ ములాఖత్ కావాల్సిన అవసరం లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని అన్నారు.  మంత్రి తలసాని ముందస్తు సవాల్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. పీకే టీమ్ తో కేసీఆర్ సర్వేలు చేయిస్తుండటంతో.. ముందస్తు కోసమే ఆయన కసరత్తు చేస్తున్నారని చర్చ జరిగింది. తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందస్తు గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.  

READ ALSO: Trs Fire on BandI Sanjay: సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు సంజయ్.. వరంగల్ టీఆర్ఎస్ నేతల ఫైర్

READ ALSO: Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News