Ganesh Visarjan 2024: యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ వినాయక మహా నిమజ్జనం యాత్రకు ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. అధికార యంత్రంగా పోలీస్ శాఖతో కలిసి శాంతియుతంగా మహా నిమజ్జన శోభాయాత్ర జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అయితే శోభాయాత్రలో చోటుచేసుకునే అల్లర్లు, వేధింపులు, ఆకతాయిల తుంటరి చర్యలపై బీజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిపై పోలీస్ శాఖ నిఘా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజా సింగ్ లేఖ రాశారు.
Also Read: Telangana Elections: రేవంత్ సర్కార్‌కు భారీ షాక్.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?
'గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి గొడవలు చేస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అలా చేసేవాళ్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. గతేడాది కూడా ఇలాగే జరిగితే కఠిన చర్యలు తీసుకున్నారు' అని రాజా సింగ్ గుర్తు చేశారు. 'గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఎవరి దగ్గరైనా మద్యం బాటిళ్లు కనిపిస్తే.. ఎవరైనా మద్యం సేవించిన వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు.
Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్ ట్విస్ట్.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి
ఇక హిందూ భక్తులకు కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. 'ఇది మనధర్మం.. ఇది మన సంస్కృతి. హిందూవులకు సంబంధించిన అతి పెద్ద పండుగ ఇది. మన సంస్కృతిని కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎవరైనా మద్యం తాగి గణేశ్ నిమజ్జనంలో పాల్గొనవద్దు' అని దండం పెట్టి రాజా సింగ్ కోరారు. శోభాయాత్రలో అలా ఎవరైనా మద్యం సేవించి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.
గతేడాది ప్రశాంతం.. మరి ఈసారి?
హైదరాబాద్‌లో ఈనెల 17వ తేదీన నగరవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం కొనసాగనున్న విషయం తెలిసిందే. మొదట బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత నగరంలోని మిగతా గణనాథులు ముందుకు కదులుతారు. కొన్ని గంటల పాటు కొనసాగే మహా నిమజ్జనంలో చోటుచేసుకునే అవాంఛనీయ సంఘటనలపై రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది పటిష్ట చర్యలతో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా నిమజ్జనం సాఫీగా సాగింది. ఈసారి కూడా అదే రీతిలో కొనసాగాలని రాజా సింగ్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.