Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం... పలుచోట్ల వర్షం...

Rain in parts of Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం (మార్చి 27) నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 05:11 PM IST
  • హైదరాబాద్‌లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
  • పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం
  • ఎండ వేడిమి నుంచి నగర వాసులకు ఉపశమనం
Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం... పలుచోట్ల వర్షం...

Rain in parts of Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం (మార్చి 27) నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. బేగంపేట, సికింద్రాబాద్ ప్యారడైజ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సైదాబాద్, చార్మినార్, బండ్లగూడ, బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, బంజారాహిల్స్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణితో పాటు దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్‌లోనే కాదు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటం ఉపశమనం కలిగించినట్లయింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... తెలంగాణవ్యాప్తంగా రాబోయే రెండు రోజులు పొడి వాతావరణం ఉండనుంది. 

కాగా, ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచే తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జనం మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉదయం 10గంటల వరకే వ్యవసాయ పనులు చక్కపెట్టుకుని ఇళ్లకు చేరుతున్నారు.

Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!

INDW vs SAW: టీమిండియాకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ! నోబాల్ ఎంతపని చేసే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News