Bandi Sanjay: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు దశల వారిగా వచ్చి..నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే నెల ప్రధాని మోదీ మరోమారు తెలంగాణకు రానున్నారు. ఇందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు 50 లక్షల ఆహ్వాన పత్రికలు అందించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ముఖ్య నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభకు 10 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 10 వేల మంది జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. సభ సక్సెస్‌తో సరికొత్త చరిత్ర సృష్టిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసమీకరణ, కార్యక్రమాల నిర్వహణపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలను నియమించారు. పార్టీ కోసం పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు విరాళాలు సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రతి కార్యకర్త భాగస్వామ్యం అయ్యేలా విరాళాల సేకరణ ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. ఇందులోభాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై మంతనాలు జరిపారు. ఎన్‌ఈసీ కార్యవర్గ సమావేశాల సన్నాహక ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈసమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఎన్‌ఈసీ సన్నాహాక మిటీ ఛైర్మన్ లక్ష్మణ్, ఇన్‌ఛార్జ్ అరవింద్ మీనన్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Also read:Etela Meet to Amith shah: అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ..త్వరలో కీలక పార్టీ పదవి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook