తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి

తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలన్నారు.

Last Updated : Feb 27, 2018, 01:22 PM IST
తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి

పార్లమెంటు తలుపులు మూసి.. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానించడమేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ విమర్శించారు. వెనుకబడిన తెలంగాణ రాష్ట్రానికి పక్షపాత వైఖరిని చూపించడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు.

సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో రెండు జాతీయ పార్టీలు దొందుదొందే అని అన్నారు.  తెలంగాణకు ద్రోహం చేసే పార్టీగా కాంగ్రెస్ ముద్రపడిందని, ఆ పార్టీ ఇప్పటికీ ఆ పంథాను మార్చుకోవడం లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ అనడం దారుణమన్నారు. నాటి విభజన చట్టంలోనూ ఏపీలోని పొలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి ప్రస్తావించి తెలంగాణలోని ప్రాణహిత ప్రాజెక్టును మరచిపోయారన్నారు. జైరాం వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సమాధానమిచ్చిన తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చేవెళ్లను సెంటిమెంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ఆ ప్రాంతానికి ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు.
 
గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సమస్యలను కాంగ్రెస్ పరిష్కరించలేకపోయింది. ఆ పార్టీ ఇప్పటికీ ఆ పంథాను మార్చుకోవడం లేదని అన్నారు. నాటి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లోని పోలవరంకు కాంగ్రెస్ జాతీయ హోదా కల్పించింది.  కానీ తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మరిచింది. జైరాం వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సమాధానమిచ్చిన తర్వాతే బస్సు యాత్ర ప్రారంభించాలని  డిమాండ్‌ చేశారు.

Trending News