తెలంగాణకు వచ్చే ఆ ప్రయాణికులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నేడు దేశ వ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.

Last Updated : May 25, 2020, 03:54 PM IST
తెలంగాణకు వచ్చే ఆ ప్రయాణికులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నేడు దేశ వ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేవలం ప్రయాణికులు తగినంత సంఖ్య లేని పక్షంలో మాత్రమే విమానాలు రద్దవుతున్నాయని చెప్పారు.  బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

ఇవాళ తొలిరోజు 19 విమానాలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, అదే సమయంలో మరో 19 విమాన సర్వీసులు శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు. జరుగుతుంది. రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘ప్రయాణికుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నాం.  ఏ అనుమానాలకు తావివ్వకుండా ప్రయాణికులను తాకకుండా (టచ్ చేయకుండా) సెన్సార్‌లు ఏర్పాటు చేశాం. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్  లేదు. నేడు 1600 మంది ఇతర రాష్ట్రాల నుండి నేడు హైదరాబాద్‌కి వస్తున్నారు.   మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్

ఇక్కడికి వస్తున్న ప్రయాణికులకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన ప్రయాణికులలో ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నాం. సెక్యూరిటీ, ఆరోగ్య పరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ వారు సూచించే సూచనలు సలహాలు ప్రతి ప్రయాణికుడు పాటించాలని’ సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News