New year celebrations in hyderabad 2025: హైదరబాద్ లో ఎక్కడ చూసిన ప్రస్తుతం క్రిస్మస్, మరోవైపు కొత్త ఏడాది జోష్ కన్పిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది. చాలా మంది కొత్త ఏడాదికి పార్టీలు చేసుకుంటుంటారు. కొందరు తమ ఫ్యామిలీతో అపార్ట్ మెంట్లలో చేసుకుంటుంటే... మరికొందరు మాత్రం హోటల్స్, రెస్టారెంట్ల లలో ఈవెంట్లకు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలో కొంత మంది ఇదే చాన్సుగా భావించి భారీగా డబ్బులు దండుకుంటుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరబాద్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లకు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. ఎక్కడైతే హోటళ్లు, రెస్టారెంట్లలో ఈవెంట్లు రాత్రి 1 గంట వరకు నిర్వహిస్తారో.. అలాంటివారు.. 15 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకొవాలని ఆదేశించారు.
అదే విధంగా.. ఆయా రెస్టారెంట్లు, హోటల్స్ లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో నిర్వహించే ఈవెంట్లు.. రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాలన్నారు. కపుల్ బార్లు, రెస్టారెంట్లకు చిన్న పిల్లలు, మైనర్ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Read more: Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..
ఎవరైన సరే.. డ్రగ్స్ వంటి ఘటనలు జరక్కుండా చూడాలన్నారు. అదే విధంగా అమ్మాయిలతో కూడా డ్యాన్స్ లు, అసాంఘీగిక కార్యక్రమాలు చేసినట్లు బైటపడితే..మాత్రం కఠిన చర్యలుంటాయని సీపీ సీవీ ఆనంద్ మాస్ ధమ్కీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
సాధారణంగా చాలా మంది కొత్త ఏడాది వేళ ఎన్నో ఆశలతో, ఉల్లాసంగా.. డ్యాన్స్ లు చేస్తు హ్యాపీ న్యూయర్ అంటూ వేడుకలు నిర్వహించుకుంటారు. అదే విధంగా పోలీసులు సైతం ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనాలు నడిపితే..వదిలే ప్రసక్తి లేదని సీపీ హెచ్చరించినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.