హైదరాబాద్: రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిపై గవర్నర్ తమిళిసై నిర్వహించిన సమీక్షకు ( Review on COVID-19 ) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సైతం ఇదే అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సమీక్షకు హాజరుకాని సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. గవర్నర్ ఆహ్వానం పంపినా హాజరుకాని వీరిద్దరినీ విధుల్లో నుంచి తొలగించాలని అన్నారు.
Also Read: Secretariat Demolition: తెలంగాణ చరిత్రలో నేడు బ్లాక్ డే..
ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ రేవంత్ రెడ్డి.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని విరుచుకుపడ్డారు. గవర్నర్ సెక్షన్ 8ని ఉపయోగించాలని, హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని రేవంత్ రెడ్డి కోరారు. కరోనావైరస్ కట్టడి కోసం దాతలు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని, రానున్న 6 నెలల పాటు ఫాంహౌస్ నుంచే కేసీఆర్ (KCR) పాలనను నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశంలోనే 'వేర్ ఈజ్ కేసీఆర్' ( #WhereisKCR ) అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధుల ఆరోగ్యంపై కూడా బులెటిన్ విడుదల చేయాలని కోరారు. Also Read: Telangana: తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం