Mohan babu wife letter to pahadi shareef police: మంచు మోహన్ బాబు ఇంట ఫ్యామిలీ గొడవల్లో సినిమాలకు మించి ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయనిచెప్పుకొవచ్చు. తాజాగా, మంచు మనోజ్ డిసెంబరు 14న తన తల్లి బర్త్ డే ఉందని అప్పడు.. విష్ణు అక్కడికి వచ్చి దాడిచేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.
జనరేటర్ లో చక్కెర నీళ్లు వేసి.. మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడని, ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందని కూడా పహడీ షరీఫ్ పోలీసులకు ఎదుట చెప్పినట్లు సమాచారం. దీనిపై తాజాగా.. మంచు మోహన్ బాబు.. సతీమణి నిర్మల తొలిసారి స్పందించినట్లు తెలుస్తొంది. ఈ మేరకు లేఖను కూడా విడుదల చేశారు.
విష్ణు జనరేటర్లో పంచదార పోయలేదు.. నా పుట్టినరోజు కోసం కేక్ తెచ్చాడు
లేఖ విడుదల చేసిన మనోజ్ తల్లి https://t.co/MPCMxKdqww pic.twitter.com/m0heifTO6P
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2024
డిసెంబరు 14 న తన బర్త్ డే వేడుకల కోసం... జల్ పల్లికి విష్ణు వచ్చాడని.. అన్నారు. కానీ ఎలాంటి గొడవలకు కారణమయ్యే విధంగా ప్రవర్తించలేదన్నారు. ఈ ఇంటి మీద నా చిన్న కొడుకైన మనోజ్ కు.. ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉందని క్లారిటీ ఇచ్చారు.
నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే విధంగా.. తన రూములో ఉన్న సామానులు తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారన్నారు.
Read more: Mohan Babu Arrest: మోహన్ బాబుకు అరెస్ట్ ఖాయం.. పోలీస్ కమిషనర్ సంచలనం..!
నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదని నిర్మల స్పష్టం చేశారు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని తెల్చి చెప్పారు. అదే విధంగా.. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా 'మేమిక్కడ పని చేయలేమని', వాళ్ళే మానేస్తున్నారని కూడా మంచు నిర్మల చెప్పడం ప్రస్తుతం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.