K Kavitha: కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ వాదం తెలవదని.. వారెప్పుడూ కాంగ్రెస్ వాదులేనని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణవాదం తెలియని కాంగ్రెస్ నాయకులు బతుకమ్మపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ తల్లి రూపం మార్చడం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహంపై గెజిట్ ఇవ్వడం దారుణంగా పేర్కొన్నారు. ఆయనో పిరికి ముఖ్యమంత్రి అంటూ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు పోరాడుతామని.. ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తామని.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు.
Also Read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. మృతురాలు రేవతి భర్త కేసు వెనక్కి?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బతుకమ్మపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కళాకారులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ వివరాలు వెల్లడించిన అనంతరం రేవంత్ రెడ్డి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నేనేమీ చేసేది లేదు
'ఓట్లు ఉన్నపుడు పండుగలు గుర్తు వస్తాయి మీకు.. మిగతా సమయంలో మరచిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని అంటున్నారు. రాష్ట్ర పండుగ అని జీవోలు ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు బతుకమ్మపై వితండవాదం చేస్తున్నారు' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. వారిపై ఏం చర్యలు తీసుకుంటారని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 'మీరు ఎన్ని రకాలుగా అడ్డుకున్న ఊరురా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం' అని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి ఏర్పాటుపై ఆవిష్కరించే దాకా ఎందుకు రహాస్యంగా ఉంచారని ప్రశ్నించారు.
'రేవంత్ సంకుచిత బుద్ది ఉంది. కేసీఆర్‌లో ఏనాడూ కనిపించలేదు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నం మేము ఇన్నేళ్లు చేశాం. కాంగ్రెస్ వచ్చాక ఇప్పుడు పండుగలను నిర్లక్ష్యం చేశారు. పాటలను అవహేళను చేసేలా కుట్ర చేస్తున్నారు' అని కాంగ్రెస్ విజయోత్సవాలను కవిత తప్పుబట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter