Akbaruddin Owaisi: మమల్ని చంపాలని చూస్తున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..

Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2024, 04:07 PM IST
  • మాపై హత్యకు కుట్రపన్నుతున్నారు..
  • జైలుకు పంపిస్తారన్న అక్బరుద్దీన్..
Akbaruddin Owaisi: మమల్ని చంపాలని చూస్తున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..

MLA Akbaruddin Owaisi Sensational Comments: కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ తీవ్ర దుమారంగా మారింది. తెలంగాణలో లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు కావడం, మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం పెను దుమారంగా మారింది. ఇక మరోవైపు, ఏపీలో సీఎం జగన్ పై రాళ్లదాడి జరగడం, జనసేన పవన్ కళ్యాన్, చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలపై ఈసీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఇక తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లు, బీఆర్ఎస్ లు నువ్వా.. నేనా అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఏపీలో అధికార వైఎస్సార్పీపీ మరోసారి పట్టం కట్టాలని ప్రచారం నిర్వహిస్తుంది. ఇక..  బీజేపీ, టీడీపీ,జనసేనలు కూటమిగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. 

Read More: Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..

ఇక తెలంగాణలో వరుసగా నాయకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీ ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు తీవ్ర దుమారంగా మారాయి.  పాతబస్తీలో ఎంఐఎం నేతలతో అసదుద్దీన్ ఓవైసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో  అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తన సోదరుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని, తనను చంపాలని చూస్తున్నారన్నారు. మా సోదరులను ఎలాగైన జైలుకు పంపాలని చూస్తున్నారని, ఆ తర్వాత వైద్యం పేరిట.. స్లోపాయిజన్ ఇంజెక్షన్ ను శరీరంలో ఎక్కించి హత్య చేయాలని చూస్తున్నారన్నారు.  

అదే విధంగా హైదరాబాద్ లో బలంగా ఉన్న మమ్మల్ని కొందరు ఓడించేందుకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కానీ ఎవరు ఎన్ని రాజకీయాలు చేసిన కూడా ఎన్నికల బరిలో గెలిచేది తామేనని.. అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం మాధవిలతకు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం మాధవీలత తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తుంది.

Read More: Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..

ఓల్డ్ సిటీ అనేది కొందరు డెవలప్ కాకుండా చూస్తున్నారని, అందుకు ఇక్కడ మెట్రోపనులు కూడా ఆలస్యం అయ్యే విధంగా చేశారన్నారు. అనేక సర్వేలలో మాధవీలత ప్రస్తుతం, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కన్న ముందున్నట్లు కూడా పలు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమంటూ కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. ఇక.. అసదుద్దీన్ ఓవైసీ చేసిన జైలు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News