జన సంద్రమైన గిరిజన జాతర

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా . . భారీ పోలీస్ భద్రతను కూడా కేటాయించారు.

Last Updated : Feb 6, 2020, 09:14 AM IST
జన సంద్రమైన గిరిజన జాతర

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా . . భారీ పోలీస్ భద్రతను కూడా కేటాయించారు. అడుగడుగునా నిఘా కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నిన్న ( బుధవారం ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు ( శుక్రవారం ) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ, సీఎస్ సమీక్షించినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అమ్మవార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ... సమ్మక్క- సారక్క జాతర కోసం మరిన్ని నిధులు ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర జాతరగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రేపు అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారోనని అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఐతే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో ములుగు జిల్లాకు సమ్మక్క- సారక్క ములుగు జిల్లా అని పేరు పెడతానని గతేడాది సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ ఆ హామీ  ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read Also: జాతర స్పెషల్.. మేడారంలో ఉచిత వైఫై సేవలు

తెలంగాణ కుంభమేళా సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా సాగుతోంది. నిన్న ప్రారంభమైన జాతర ఫిబ్రవరి 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు తండోపతండాలుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు సమ్మక్క గద్దె మీదకు రానుంది. ఈ క్రమంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గిరిజన జాతరకు ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News