Karimnagar Politics: ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులుగా ఉండే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కలిసిపోయాయి. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి ఒక్క చోట కనిపించారు. ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిణామం కరీంనగర్ జిల్లాతోపాటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: WEF 2025 Invests: పెట్టుబడుల్లో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు.. రాష్ట్రానికి రూ.1.32 లక్షల కోట్లు
కరీంనగర్‌లోని పద్మానగర్‌లో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి పాల్గొన్నారు. పరస్పరం విమర్శలు.. ఆరోపణలు చేసుకోకుండా హుందాగా వ్యవహరించారు. రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండొద్దని ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు చాటిచెప్పాయి.
Also Read: Amazon Investment: మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు.. అమెజాన్ అడ్డాగా తెలంగాణ
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయనని సంచలన ప్రకటన చేశారు. అందరితో కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. పదవులొస్తాయి.. పోతాయి.. అభివృద్దే శాశ్వతమని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయనని తేల్చిచెప్పారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాలతో పూర్తిగా వినియోగంలోకి రాలేదు బండి సంజయ్ చెప్పారు. 'వరంగల్‌కు ధీటుగా కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా నిధులు తీసుకొస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం' అని బండి సంజయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. రెండు ప్రధాన పార్టీలు.. బద్ధ శత్రువులు ఎలాంటి వివాదం లేకుండా సాఫీగా కార్యక్రమాన్ని ముగించడంతో కరీంనగర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.