Hyderabad Kidney Rocket: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావన అవయవాల అక్రమ రవాణాపై ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. కాసుల కక్కుర్తి కోసం కొంత మంది మానవత్వాన్ని మరుస్తున్నారు. మావన అవయవాల అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నట్టు జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఇపుడు తెలంగాణ చేరిందనే చెప్పాలి. చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్న నిరుపేదలే వారి టార్గెట్. ఈ అక్రమ మావన అవయవాల దందాల కొంత మంది డాక్టర్లు.. యాజమాన్యాలతో కలిసి వారి అవయవాలను గుట్టు చప్పుడు కాకుండా గప్ చుప్ గా కొట్టేస్తున్నారు.
అంతేకాదు అమాయకంగా హాస్పిటల్ జాయిన్ అయిన నిరుపేదలను టార్గెట్ చేసుకొని వారికి తెలియకుండానే వారి ఒంట్లో అవయావాలను కొట్టేస్తున్నారు. ఈ అక్రమ దందా కొత కొన్నేళ్లుగా జరుగుతున్న తాజాగా జరిగిన ఓ సంఘటనతో హైదరాబాద్ సరూర్ నగరల్ లో అమ్మాయిల కిడ్నీలు దొంగలిస్తున్న ముఠా గుట్టు వీడింది. అందులో కొంత మంది బతుకు దెరువు కోసం తమ కిడ్నీలను అమ్ముకోవడానికి హైదరాబాద్ వస్తున్నారు. వీళ్ల మధ్యలో ఓ దళారి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా DM HO వెంకటేశ్వర్లు, హాస్పిటల్‌ను తనిఖీలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కయి కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్స్ ను అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.