హైటెక్ సిటీ -రాయదుర్గం మధ్య రాకపోకలు సాగించే ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఐటి ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రధాన రద్దీ ప్రాంతమైన హైటెక్ సిటీ-రాయదుర్గం మార్గంలో 1.5 కీ మీ మేర మెట్రో మార్గాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.

Last Updated : Nov 29, 2019, 06:50 PM IST
హైటెక్ సిటీ -రాయదుర్గం మధ్య రాకపోకలు సాగించే ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: ఐటి ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రధాన రద్దీ ప్రాంతమైన హైటెక్ సిటీ-రాయదుర్గం మార్గంలో 1.5 కీ మీ మేర మెట్రో మార్గాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ మార్గంలో మెట్రో రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో అదనంగా 40 వేల మంది ప్రయాణికులకు రవాణా సౌలభ్యం కలగనుంది. ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగించే ఐటి ఉద్యోగులు ఎంతో కాలంగా ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు. 

రద్దీ అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ఈ మెట్రో రైల్వే లైన్ ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి సమయాన్ని, దూర భారాన్ని తగ్గించనుంది. ఇద్దరు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో మార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైలు లైన్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

Trending News