ED raids on Abhishek Rao: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావుపై ఈడీ నిఘా.. అనూస్ ఆఫీసును జల్లెడ పట్టిన ఈడీ

ED raids on Anoo's office in Madhapur: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న అనూస్ కార్పొరేట్ ఆఫీసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. అనూస్ కార్యాలయంలో ఇవాళ ఉదయం మొదలైన ఈడీ సోదాలు దాదాపు 10 గంటలపాటు కొనసాగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2022, 07:43 PM IST
ED raids on Abhishek Rao: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావుపై ఈడీ నిఘా.. అనూస్ ఆఫీసును జల్లెడ పట్టిన ఈడీ

ED Raids on Anoo's office in Madhapur: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న అనూస్ కార్పొరేట్ ఆఫీసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. అనూస్ కార్యాలయంలో ఇవాళ ఉదయం మొదలైన ఈడీ సోదాలు దాదాపు 10 గంటలపాటు కొనసాగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో బోయినపల్లి అభిషేక్‌కి చెందిన రాబిన్ డిస్టిలరిస్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్న నేపథ్యంలోనే అనూస్ కార్యాలయంలో ఈడీ తనిఖీలు జరిగాయి. అనూస్‌కి అభిషేక్ రావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో పాటు అనూస్ మాదాపూర్ కార్యాలయం అడ్రస్‌నే రాబిన్ డిస్టిలరీస్‌కి కూడా అడ్రస్‌గా ఉపయోగించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదైన కంపెనీల్లో మూడు కంపెనీలకు అనూస్ మాదాపూర్ కార్పొరేట్ ఆఫీసునే చిరునామాగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనూస్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. 

మాదాపూర్‌లోని అనూస్ కార్పొరేట్ హెడ్ క్వాటర్స్‌తో పాటు డైరెక్టర్ అభిషేక్ రావుకి చెందిన ఇతర వ్యాపార సంస్థల కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనూస్ బ్యూటీ పార్లర్‌కి బ్రాంచీలు ఉండగా.. మాదాపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచే బిజినెస్‌కి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నారు.

Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు కథనాలపై స్పందించిన కవిత

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ.. నెక్స్ట్ టార్గెట్ సారేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News