Telangana DSC: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. రేపే కొత్తది..!

TS DSC 2024: గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కారు రద్దు చేసింది. మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీ ఇచ్చేందుకు ఇలా చేసింది.  కొత్త నోటిఫికేషన్ రేపే వచ్చే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Last Updated : Feb 28, 2024, 11:05 PM IST
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. రేపే కొత్తది..!

Telangana DSC Notification cancelled:  తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. గత సెప్టెంబర్‌లో  5,089 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళో, రేపో దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్న నేపథ్యంలో.. 2023లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. గత డీఎస్సీ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకున్న వారు ఇప్పుడు కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. 

మెగా డీఎస్సీ రేపే..!

గత ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి 2023 సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తులను స్వీకరించింది. నవంబరులో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ కారణంగా టీఆర్టీని వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వ రావడంతో పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి మరిన్ని పోస్టులను కలిసి మెగా డీఎస్సీ ఇవ్వనున్నారు. గత పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులు యాడ్ చేయనున్నారట. దీంతో మెుత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. ఇందులో 6,500కు పైగా ఎస్జీటీ పోస్టులే ఉన్నట్లు సమాచారం. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు 2,600 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: Gruha Jyothi: ఫ్రీ కరెంట్ కదా అని ఇలా చేశారంటే కరెంట్ కట్.. కేస్ ఫైల్..

Also Read: CM Revanth Reddy: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News