BRS MLC K Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం..

Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె మధ్యంత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీనిలో కోర్టు సీబీఐ వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2024, 12:32 PM IST
  • కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు..
  • సీబీఐతో ఏకీభవించిన ధర్మాసనం..
BRS MLC K Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం..

Delhi Liquor Case Rouse Avenue Count Rejects  MLC Kavitha Interim Bai: ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో గులాబీబాస్ కు, బీఆర్ఎస్ నేతలకు, వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అంతే కాకుండా.. ఒకవైపు లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇరుక్కొవడం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతుంది. అదే విధంగా.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతీని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తెరమీదకు తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. దీనితో పాటు, బీఆర్ఎస్ ను ఇంతటి కష్ట సమయంలో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వదిలిపెట్టి  వెళ్లిపోతున్నారు.

Read More: CM Revanth Reddy Horoscope: వైఎస్సార్ లా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సీఎం రేవంత్.. క్రోధి నామ సంవత్సరంలో ఆయన చరిష్మా ఎలా ఉండబోతుందో తెలుసా..?

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. హోదాను, పదవులను అనుభవించి తీరా, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వదలడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని భవిష్యత్తులో కాళ్లు పెట్టుకుని వేడుకున్న కూడా రానివ్వమని గులాబీనేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టై తీహర్ జైలులో ఉన్నారు. అంతే కాకుండా.. ఆమెకు కోర్టు వారు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు.

ఈ క్రమంలో గతంలో తన చిన్న కొడుక్కు ఎగ్జామ్ లు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్ 4 న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఇదిలా ఉండగా సీబీఐ కవిత బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేస్తారని, బాధితులను బెదించే అవకాశం ఉందని సీబీఆర్ కోర్టులో తమ వాదనలు విన్పించింది. దీనిపై విచారించిన కోర్టు..మధ్యంత బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.  

Read More: Ponguleti Srinivas Reddy: తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. స్మగ్లింగ్ కేసులో రెవెన్యుమంత్రి కుమారుడు..?

ఇక మరోవైపు.. కవిత సాధారణ బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యే కోర్టు ఈనెల 20 న విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా..ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15 న కల్వకుంట్ల కవితను హైదారాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులతో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News