COVID-19: తెలంగాణలో 55 కరోనా పాజిటివ్ కేసుల నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 44  జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని, మిగిలిన 11 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 8

Last Updated : May 17, 2020, 12:29 AM IST
COVID-19: తెలంగాణలో 55 కరోనా పాజిటివ్ కేసుల నమోదు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 (COVID-19 Cases) కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 44 (Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని, మిగిలిన 11 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 8, సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయని (Telangna Health Ministry) రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటితో మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1509 కు చేరింది. అయితే ఈ రోజు‌ 12 మంది డిశ్చార్జ్ కాగా దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 504 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయి ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య 971 మందిగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది మరణించినట్లు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Also Read: RGV 'GST'ని మించిన 'క్లైమాక్స్'..

Trending News