Hyderabad: గ్రేటర్ లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

Hyderabad: తెలంగాణలో ( Telangana ) కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ సంక్రమణ పెరుగుతోంది. అయితే గ్రేటర్ (GHMC ) పరిధిలో మాత్రం పాజిటీవ్ కేసుల సంఖ్య  తగ్గుతోంది. వరుసగా నాలుగు రోజుగా హైదరాబాద్ లో 500 కన్నా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. 

Last Updated : Aug 12, 2020, 04:41 PM IST
Hyderabad: గ్రేటర్ లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

Hyderabad: తెలంగాణలో ( Telangana ) కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ సంక్రమణ పెరుగుతోంది. అయితే గ్రేటర్ (GHMC ) పరిధిలో మాత్రం పాజిటీవ్ కేసుల సంఖ్య  తగ్గుతోంది. వరుసగా నాలుగు రోజుగా హైదరాబాద్ లో 500 కన్నా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కంటైన్మెంట్ ( Containment Zones ) జోన్ల సంఖ్య కూడా తగ్గుతోంది. గ్రేటర్ పరిధిలో జులై 30న మొత్తం 92 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కేవలం 65 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఈ విషయం వెల్లడైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. 

 

ఎల్బి నగర్ ( LB Nagar ) ప్రాంతంలో గతంలో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా నేడు అది ఆరుకు చేరుకుంది. చార్మినార్ ( Charminar ) లో గతంలో మొత్తం 31 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.  ప్రస్తుతం ఆ సంఖ్య 15కు చేరుకుంది. ఖైరతాబాద్ ( Khairatabad ) లో 15 రోజుల క్రితం 14 కంటైన్మెంట్ జోన్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 21కు చేరుకుంది. 

 

Trending News