Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం: రాహుల్ గాంధీ

Jagtial Congress Public Meeting: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని.. ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని.. తన ఇల్లు ప్రజల్లో హృదయాల్లో ఉందన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Oct 20, 2023, 01:00 PM IST
Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం: రాహుల్ గాంధీ

Jagtial Congress Public Meeting: ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే క్వింటా పసుపుకు రూ.12 వేలు ధర కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధమని అన్నారు. ఈ అనుబంధం ఈనాటిది కాదని.. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందన్నారు. జగిత్యాలలో జరిగిన బహిరంగలో ఆయన మాట్లాడారు.

"బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటే.. వీరిమధ్య చీకటి ఒప్పందం ఉంది. కేంద్రంలో బీజేపీకి, బీఆర్ఎస్.. రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం సహకరించుకుంటున్నాయి. నేను బీజేపీపై పోరాటం చేస్తుంటే.. నాపై కేసులు పెట్టారు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు.. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు.. నా ఇల్లు భారత ప్రజలు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంది. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో.. కానీ ప్రజల హృదయాల్లోంచి కాదు.. కులగణనపై పాట్లమెంటులో డిమాండ్ చేశా.. ప్రధాని నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు..

రాష్ట్రంలో కేసీఆర్ కులగణనకు ముందుకు రావడంలేదు. కులగణన అటు మోడీకి.. ఇటు కేసీఆర్ కు ఇష్టంలేదు. దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్ లది కీలక పాత్ర. అలాంటి అధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాలకు చెందినవారే. అందుకే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతాం.. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతాం.. కులగణన ఎక్స్ రే లాంటిది.. కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి.

ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి.. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్‌ఎస్‌తో పోరాడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం.." అని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News