CM Revanth Reddy: ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంక్షేమ రాజ్యంగా మారుస్తాం: రేవంత్ రెడ్డి

Congress Six Guarantees: ఫ్రీ బస్ సర్వీస్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచుతూ మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2023, 03:24 PM IST
CM Revanth Reddy: ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంక్షేమ రాజ్యంగా మారుస్తాం: రేవంత్ రెడ్డి

Congress Six Guarantees: అసెంబ్లీ ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మీ పథకాన్ని, ఆరోగ్య శ్రీ లిమిట్‌ను రూ.10 లక్షలకు పెంచుతూ మరో స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ కొత్త పోస్టర్‌తోపాటు జీరో ఛార్జ్ టికెట్‌ను మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో ఘనంగా జరిగింది. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని అన్నారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని అన్నారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని.. వీటిలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మహిళలు నేటి నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామన్నారు.

"డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజు అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ జన్మదినం.. స్వరాష్ట్ర ఆవిర్భావానికి పునాది పడిన రోజు ఒక్క రోజే కావడం దైవ సంకల్పం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లిగా సోనియమ్మ ఇక్కడ ప్రజల గుండెల్లో ఉంటారు. సహచర కాంగ్రెస్ మిత్రులతో కలిసి గాంధీ భవన్ లో సోనియమ్మ జన్మదినం వేడుకల్లో పాల్గొన్నాను.." అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News