Cm Revanth Reddy delhi tour cabinet expansion Rumours: తెలంగాణ రాజకీయాలు వర్షకాలంలో హీట్ ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్నిరోజులుగా కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ను ఎన్నిక కూడా ఉండనుందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క లు మొదలైన నేతలంతా, కొన్నిరోజులుగా హస్తినలో మకాం పెట్టారు. దీనిలో భాగంగా మంత్రి వర్గ కూర్పు రేపే ఉంటుందని కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మంత్రులను సైతం అధిష్టానం ఫైనల్ చేసినట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఒకవైపు పీసీసీ చీఫ్ పదవీ కోసం, రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వడంతో బీసీ నేతకు పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేసులో మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ , జగ్గారెడ్డి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరికి మంత్రి వర్గంలో బెర్తులు..?
మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేర్లు, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పోచారంకు కూడా మంత్రి పదవి ఇవ్వోచ్చని కూడా వార్తలు జోరుగా ప్రచాంరంలో ఉన్నాయి. ఒక సీతక్కకు హోమ్ మంత్రి పదవి ఇవ్వోచ్చని కూడా ప్రచారం జరుగుతుంది.
Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
ఆషాడం ఎఫెక్ట్..
మరో రెండు రోజుల్లో ఆషాడ మాసం ఉంది. బుధవారం లేదా గురువారం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చని వార్తలు ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో నరాలు తేగె ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. ఒక వేళ ఇప్పుడు కనుక విస్తరణ ఉండకపోతే.. ఆషాడం తర్వాత మరల విస్తరణ ఉండోచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. చాలా మంది ఆషాడ మాసంలో మంచి పనులు చేయరు. ఆషాడంను శూన్యమాసం కూడా అంటారు. అందుకే రేపు లేదా ఎల్లుండి తప్పకుండా మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చని వార్తల ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి