Karate Kalyani: తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంక్ వీడియోల అంశం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సినిమానా.. ఫ్రాంక్ వీడియోలా అనే విధంగా వార్ కొనసాగింది. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు అందింది. 20 యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్‌లో సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు.
సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదును అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు షురూ చేయనున్నారు. ఐటీ యాక్ట్‌లోని 67A,509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు పంపనున్నారు. ఇప్పటికే వీటిపై సీసీఎస్ పోలీసులు నిఘాను ఉంచారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
ఇటీవల ఫ్రాంక్ వీడియోల అంశం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రమోషన్లో భాగంగా సినీ నటుడు విశ్వక్సేన్..హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ రోడ్డులో ఫ్రాంక్ వీడియో తీశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నగర నడిబొడ్డున ఇలా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీసుల దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సినిమా ప్రమోషన్ కోసం ఎలా చేయడం ఏంటన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
విశ్వక్ సేన్ ఘటన తర్వాత ఫ్రాంక్ వీడియో గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అమీర్‌పేటలో సినీ నటి కరాటే కళ్యాణి, ఫ్రాంక్ వీడియో నటుడు శ్రీకాంత్ మధ్య ఘర్షణ జరిగింది. అసభ్య వీడియోలు చేయడం వల్లే నిలదీశానని కరాటే కళ్యాణి తెలిపారు. ఐతే కొన్ని కారణాల వల్లే తనతో సినీ నటి గొడవ పెట్టుకుందని శ్రీకాంత్ ఆరోపించాడు. ఈ అంశం పోలీస్ స్టేషన్ దాకా చేరింది. ఇరువురు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి శిశువులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు సైతం ఆమె ఇంటిపై దాడులు చేశారు.
తాజాగా కరాటే కళ్యాణి ఫిర్యాదుతో ఫ్రాంక్ వీడియోల అంశం తెరపైకి వచ్చింది. ఇలాంటి వీడియోలు చేసే వారిపై ఉక్కుపాదం తప్పదంటున్నారు పోలీసులు. అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానెళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సినీ నటి కరాటే కళ్యాణి. ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. త్వరలో అసభ్యకర ఫ్రాంక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు చెప్పారని..త్వరలో నోటీసులు ఇస్తారన్నారు. వీటిపై న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Also read:Amreen Bhat: టీవీ నటిని చంపేసిన ఉగ్రవాదులు హతం.. కశ్మీర్ పోలీసుల క్విక్ రియాక్షన్
Also read:Sharmila Comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు..షర్మిల ఆగ్రహం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook