MP Candidates: బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్‌

BRS Party MP Candidates: అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన గులాబీ పార్టీ ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు, ఇద్దరు మాజీలకు అవకాశం కల్పించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2024, 07:19 PM IST
MP Candidates: బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్‌

BRS Party Candidates: అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ పార్లమెంట్‌ ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లోక్‌ సభ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. అందులో భాగంగా తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తూ గులాబీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులుగా మరోసారి ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు అవకాశం ఇచ్చింది. మరో ఇద్దరిలో ఒకరు మాజీ ఎంపీ కాగా, మరొకరు మాజీ మంత్రి ఉన్నారు.

Also Read: KA Paul: బాబు మోహన్‌ సంచలనం.. మూడు పార్టీలు వదిలేసి ఆఖరికి కేఏ పాల్‌ పార్టీలో చేరిక

అభ్యర్థులు వీరే..

  • కరీంనగర్‌: బోయనపల్లి వినోద్‌ కుమార్‌ (మాజీ ఎంపీ)
  • పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్‌ (మాజీ మంత్రి)
  • ఖమ్మం: నామా నాగేశ్వర్‌ రావు (సిట్టింగ్‌ ఎంపీ)
  • మహబూబాబాద్‌: మాలోత్‌ కవిత (సిట్టింగ్‌ ఎంపీ)

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు పార్టీ అధినేత కేసీఆర్‌ వరుస సమావేశాలు నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. పార్లమెంట్‌ సెగ్మెంట్‌ వారీగా నాయకులతో చర్చించిన అనంతరం అభ్యర్థుల ప్రకటన చేశారు. వాస్తవంగా ఆదివారమే చేయాల్సి ఉండగా అష్టమి కారణంగా పేర్లను వెల్లడించలేదు. రాష్ట్రంలో 17 స్థానాలు ఉండగా వాటిలో నాలుగింటికి అభ్యర్థులను ప్రకటించగా.. మరో రెండు విడతల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. కాగా అభ్యర్థులుగా ఎంపికైన వారికి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నేతలంతా కలిసికట్టుగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహనం రావడం లేదు. రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వారిలో వాళ్లే కొట్టుకుంటున్నారు. అప్పుడే ఆ ప్రభుత్వంపై అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. రాబోయే కాలం మనదే' పార్టీ శ్రేణులకు చెప్పారు. ఈనెల 12వ తేదీన కరీంనగర్‌ సభ తర్వాత ఖమ్మంలో కూడా సభ నిర్వహించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేసీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి, భరోసాతో గులాబీ శ్రేణులు పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధమయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News