Bandi Sanjay: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడి నుంచో తెలుసా..?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 09:01 PM IST
  • తెలంగాణలో కమలనాథుల జోష్
  • వరుస కార్యక్రమాలతో బిజీ
  • త్వరలో బండి సంజయ్ పాదయాత్ర
Bandi Sanjay: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడి నుంచో తెలుసా..?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై భేటీలో చర్చించారు. ఎలాంటి కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్‌ సక్సెస్‌పై హర్షం వ్యక్తం చేశారు. ఈనెలాఖరున రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. దేశ ప్రధాని టూర్‌ను సైతం రెట్టింపు ఉత్సాహంతో సక్సెస్ చేయాలని నిర్ణయించారు.   

నగరంలో రోడ్‌షోలు నిర్వహించాలన్న దానిపై చర్చించారు. మరోవైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రపై కూడా మంతనాలు జరిపారు. జూన్ 23 నుంచి మూడోవిడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 12 వరకు బండి సంజయ్‌ యాత్ర సాగుతుంది. ఆగష్టు చివరి లోపు 4వ విడత సైతం పూర్తి చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు నేతలు. మూడు, నాలుగో విడత పాదయాత్రలు వరంగల్,ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరగనుంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర సాగుతుంది. ఈమేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. మూడు, నాలుగు విడత పాదయాత్రల షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి, రెండో విడత పాదయాత్రలు 67 రోజులపాటు సాగింది. 828 కిలోమీటర్ల మేర జరిగిన యాత్రలో..ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం దాదాపు 11 లక్షల మంది పాదయాత్రలో పాల్గొన్నారని బీజేపీ నేతలు వెల్లడించారు. 

13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. 66 సభలు నిర్వహించి..పార్టీ నేతలు, కార్యకర్తల్లో బండి సంజయ్ జోష్ నింపారు. ఇక నుంచి ప్రతి నెలలో 20 రోజులపాటు పాదయాత్ర ఉంటుందని..మిగిలిన 10 రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో బండి సంజయ్‌ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్‌గా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు ఉంటాయని కమలనాథులు చెబుతున్నారు.

Also read:పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..  

Also read:Mamata Comments: బీజేపీ పాలన హిట్లర్‌లను తలపిస్తోంది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News