Etela Rajendar: సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా..ఈటల రాజేందర్‌ హాట్ కామెంట్స్..!

Etela Rajendar: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా రాజకీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఫైర్ అయ్యారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 25, 2022, 06:59 PM IST
  • తెలంగాణలో హాట్ హాట్‌గా పాలిటిక్స్
  • బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
  • సీఎం కేసీఆర్‌పై ఈటల మండిపాటు
Etela Rajendar: సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా..ఈటల రాజేందర్‌ హాట్ కామెంట్స్..!

Etela Rajendar: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఇరుపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో దిష్ట వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో ఆ పార్టీ అగ్ర నేతల తాకిడి పెరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ టార్గెట్ చేస్తున్నారు. 

తాజాగా మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు ఈటల రాజేందర్‌. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని స్పష్టం చేశారు. పల్లె గోస-బీజేపీ భరోసా పేరుతో ఆ పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. సీసీ కుంట మండలం అప్పంపల్లిలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

అనంతరం ప్రసంగించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని మండిపడ్డారు. రోజురోజుకు ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోతోందన్నారు. తమ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని ఆహ్వానిచ్చారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు సైతం అవకాశం ఉందని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో వచ్చిన ఫలితామే రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్..దుర్మార్గాలు, కుట్రలు, అబబ్దాలు, మాయమాటలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని మండిపడ్డారు. 

అంతకముందు జడ్చర్లలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇటీవలకాలంలో సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల విమర్శల దాడిని పెంచారు. సీఎం నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఇప్పటికే సవాల్ విసిరారు. మొన్నటి వరకు టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంలో ఈటల రాజేందర్‌ కీలకంగా వ్యవహరించారు. ఐతే అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.

అనంతరం టీఆర్ఎస్‌ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు. హుజురాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ మళ్లీ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Also read:Axar Patel: ఆకాశమే హద్దుగా చెలరేగిన అక్షర్‌ పటేల్..17 ఏళ్ల రికార్డు బద్దలు..! 

Also read:Kaikala Satyanarayana: మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News