Bandi Sanjay: ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం.. బీజేపీ సింగిల్‌గానే పోటీ: బండి సంజయ్

Bandi Sanjay on BRS: బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. తాము సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 11, 2023, 10:51 PM IST
Bandi Sanjay: ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం.. బీజేపీ సింగిల్‌గానే పోటీ: బండి సంజయ్

Bandi Sanjay on BRS: దాచుకోవడం దోచుకోవడమే బీఆర్ఎస్ సిద్దాంతం అని.. అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసులాంటివి అని.. ఆ రెండింటినీ వేరు చేసి చూడలేమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీ చేయబోతున్నాయని జోస్యం చెప్పారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్‌ను కేసీఆర్ పోషిస్తున్నారని, బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేనిచోట కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని భీమేశ్వర గార్డెన్‌లో పార్టీ సీనియర్  నేతల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఇతర నాయకులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు గ్రామాల్లో ప్రజలకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీదే అని అన్నారు. టాయిలెట్స్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 5 కిలోలో ఉచిత బియ్యం, కరెంట్, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన రోడ్లు, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, హరిత హారం, వైకుంఠధామాల నిర్మాణానికయ్యే నిధులన్నీ ఇస్తోంది కేంద్రమేనని తెలిపారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. నాబార్డు ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 16 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. 

"ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సిద్దాంతాల్లేవు. దాచుకోవడం దోచుకోవడమే బీఆర్ఎస్ సిద్దాంతం. అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఒక్కటే. ఆ రెండింటినీ వేరు చేసి చూడలేం. కలిసే పోటీ చేయబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గల్లీలో లేదు. ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేనిచోట కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులిస్తోంది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్‌ను కేసీఆర్ పోషిస్తున్నడు. బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుంది. అధికారంలోకి రావడం ఖాయం.." అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న తేడాను వివరించారు. పేదల కోసం నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వం మోదీ అయితే.. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో రాష్ట్రం ఏర్పడితే వాటికే తిలోదకాలిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే.. అవినీతికి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. 

మోదీ కేబినెట్‌లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చలేదని.. కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి ఆరోపణలు లేని వారే లేరని అన్నారు. నాన్స్ కమిషన్ గ్రాంట్ల ద్వారా 60 వేల కోట్లు ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించడం సిగ్గు చేటు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వాళ్లంతా సెల్ఫీ వీడియోలు తీసి మోదీకి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కోరారు.

Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  

Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్‌ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News