BioAsia Summit 2023: హైదరాబాద్ వేదికగా... నేటి నుంచి బయో ఆసియా సదస్సు..

BioAsia Summit 2023: మరో ప్రపంచ స్థాయి సదస్సుకి భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి బయో ఆసియా 20వ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 09:47 AM IST
BioAsia Summit 2023: హైదరాబాద్ వేదికగా... నేటి నుంచి బయో ఆసియా సదస్సు..

BioAsia Summit 2023: నేటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇప్పుడు నిర్వహించనున్న సదస్సు 20వ ఎడిషన్. ఈ కార్యక్రమాన్ని హెచ్‌ఐసీసీలో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సదస్సును '‘మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం' అనే’ థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందులో నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌ వంటి ముఖ్యులు ఉన్నారు. 2022లో ఈ సమ్మిట్ ను కొవిడ్ కారణంగా వర్చువల్ గా నిర్వహించారు. 

ఈ బయో ఆసియా సదస్సులో పాల్గొనేందుకు 400కుపైగా అంకుర సంస్థలు పోటీపడగా.. ప్రాథమికంగా 75 సంస్థలను ఎంపిక చేశారు. అందులో నుంచి తుది జాబితాకు 5 సెలెక్ట్ అయ్యాయి. 2028 నాటికి జీవశాస్త్ర రంగంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2028 నాటికి తెలంగాణలో లైఫ్ సైన్స్ ఎకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని మంత్రి అన్నారు. ఈ సదస్సు ద్వారా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ సమ్మిట్ లో ముఖ్యంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై చర్చించనున్నారు. చివరి రోజు జీనోమ్ వ్యాలీ ఎక్స్ లెన్స్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ పురస్కారానికి ఈ సంవత్సరం ఆచార్య రాబర్ట్‌ లాంగర్‌ ఎంపికయ్యారు. 

Also Read: Kishan Reddy's Nephew Death: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News