Manchu Family Dispute: కుటుంబసభ్యుల మధ్య వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ ఒంటరివాడు అయ్యాడు.. అతడికి ఆస్తులు ఇచ్చే విషయంలో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా మనోజ్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పత్రంలో మంచు మోహన్ బాబు పేరు కానీ.. అతడి కుటుంబసభ్యుల పేర్లు కానీ లేకపోవడం విస్మయానికి గురి చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. మనోజ్ ఫిర్యాదు చేసిన అనంతరం పహాడి షరీఫ్ సీఐ కీలక విషయాలు తెలిపారు.
Also Read: Manchu Manoj: మంచు మనోజ్ మెడికల్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం సాయంత్రం మంచు మనోజ్ చేరుకుని ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులో కీలక అంశాలు వెల్లడించారు. మనోజ్ వెళ్లిపోయిన అనంతరం పహాడీ షరీఫ్ సీఐ గురువా రెడ్డి మీడియాతో మాట్లాడారు. 'కుటుంబసభ్యులపై మంచు మనోజ్ ఫిర్యాదు చేయలేదు. మోహన్ బాబుపై కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేయలేదు. ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి కేకలు వేశారని.. తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారు' అని వెల్లడించారు.
Also Read: Abhishek Bachchan: 51 ఏళ్ల వయసులో ఐశ్వర్య రాయ్ ప్రెగ్నన్సీ? అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు వైరల్
'దాడికి పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా పారిపోయారు. నాకు గాయాలయ్యాయని మనోజ్ తెలిపినట్లు' సీఐ గురువా రెడ్డి తెలిపారు. 'నాకు.. నా కుటుంబం సభ్యులకు ప్రమాదం పొంచి ఉందని మనోజ్ చెప్పారు. తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదు' అని వెల్లడించారు. దాడిలో మనోజ్ ఒక్కరికే గాయాలయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి, విజయా రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు అని కూడా మనోజ్ చెప్పినట్లు సీఐ వివరించారు. మనోజ్ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని.. ఇప్పుడేం చెప్పలేమని పేర్కొన్నారు.
డయల్ 100కు ఫోన్ రాగానే తాము వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. కాగా మంచు మనోజ్ వైద్య రిపోర్ట్‌లో మాత్రం తీవ్ర గాయాలయ్యాయని వెల్లడైంది. మెడ, భుజం.. తొడ భాగంలో గాయాలైనట్లు మెడికల్ రిపోర్ట్‌లో ఉన్నాయి. కాగా వీరి కుటుంబం వివాదం పరిష్కరించడానికి కొందరు రంగంలోకి దిగారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.