'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను భయపెడుతోంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఫలితంగా పనులు అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి అంతా స్థబ్దుగా మారింది. దీంతో పేదవారు ఆకలితో అలమటిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలకు పెరిగిన 'కరోనా' బాధితులు..!!
పూటగడవని పేదలకు పట్టెడన్నం పెట్టడం కోసం మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. అక్కడక్కడా పోలీసులే అన్నార్థులకు అన్నంపెడుతున్న పరిస్థితులు చూశాం. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ సర్కారు కూడా చేరింది. అన్నార్థులను ఆదుకునేందుకు వారికి పట్టెడు మెతుకులు పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. హైదరాబాద్ లో పట్టణ పేదల కోసం 150 అన్నపూర్ణ సెంటర్లలో ఉచితంగా ఆహారం అందిస్తోంది. గతంలో ఈ సెంటర్లలో 5 రూపాయలకు భోజనం పెట్టేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న పరిస్థితి కారణంగా .. అక్కడ పేదల కోసం ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.
అంతే కాదు .. అక్కడ కూడా సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో గుండ్రాలు ఏర్పాటు చేశారు. పేదలు.. ఆహారం కోసం వచ్చే వారు ఎవరైనా ఆయా గుండ్రాల్లోనే ఉండి .. భోజనం తీసుకోవాలి. తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్లాన్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..