హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగిరావాలని భావించి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట భారత్‌కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా 163 మందితో కువైట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ( Kuwait to Hyderabad special flight ) శనివారం రాత్రి హైదరాబాద్‌కి చేరుకుంది. ఈ స్పెషల్ ఫ్లైట్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు అందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేసిన అధికారులు.. అనంతరం విమానాశ్రయం నుంచి వారిని ఆర్టీసీ బస్సుల్లో గచ్చిబౌలి, కాచిగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. Also read : తెలంగాణలో మళ్లీ పెరిగిన COVID-19 పాజిటివ్ కేసులు
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం భారత్ చేరుకున్న అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారినే ఇంటికి పంపిస్తారు. లేదంటే పూర్తిగా కోలుకునే వరకు వారు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుందని కేంద్రహోంశాఖ స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..