Lok Sabha Elections: సర్వీసింగ్‌కు వెళ్లిన 'కారు' యమస్పీడ్‌తో దూసుకొస్తది: కేటీఆర్‌

General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్‌ కోసం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. లోక్‌సభ ఎన్నికలతో యమస్పీడ్‌తో దూసుకొస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్‌ బిల్లులు బరాబర్‌ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:22 PM IST
Lok Sabha Elections: సర్వీసింగ్‌కు వెళ్లిన 'కారు' యమస్పీడ్‌తో దూసుకొస్తది: కేటీఆర్‌

Parliament Elections: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం మల్కాజిగిరి సెగ్మెంట్‌పై పార్టీ సమీక్షించింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తీరుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్‌ కేవలం 4 లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదని పేర్కొన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయినట్లు వివరించారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని, ఈసారి ఎలాగైనా గెలుద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరి లో ఈ సారి విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, గతేడాది నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారి మాటలనే నేను గుర్తు చేశాను అంతే. నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి విక్రమార్క నాది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా ?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు కడుతుందని చెప్పారు కాబట్టే కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని పిలుపునిచ్చినట్లు వివరించారు. సోనియా కు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను సమాయాత్తం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని.. ఇప్పట్నుంచే ఒత్తిడి చేయాలని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. 'నిరుద్యోగ భృతి పై భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే. పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదాపై మాట మార్చింది' అని చెప్పారు.కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని పార్టీ నాయకులకు కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాలని చెప్పారు. పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయామని గుర్తుచేసుకున్నారు.

పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయని కేటీఆర్‌ తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. 'కారు' కేవలం సర్వీసింగ్‌కు వెళ్లింది.. మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పారు. మోడీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక అయిన బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని స్పష్టంగా తెలుస్తోందని కేటీఆర్‌ చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పని చేసి మెజార్టీ స్థానాలు సాధిద్దామని కేటీఆర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News