Corona in medical college: కరీంనగర్(Karimnagar)లో కరోనా కలకలం రేపింది. బొమ్మకల్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాల(Medical College)లో 39 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్(Covid-19)గా నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్తగా కాలేజీకి సెలవులు ప్రకటించింది యాజమాన్యం. ఈ కళాశాలలో వారం రోజుల కిందట స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ లక్షణాలు ఉన్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలిన వారికి వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Also Read: Hyderabad:తెలంగాణలో ఒమిక్రాన్?-హైదరాబాద్‌లో 12 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ..తెలంగాణ(Telangana)లో కొవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే ఆంశం. గత కొద్ది రోజులుగా తెలంగాణలోని గురుకులాలు, కళాశాలల్లో కరోనా కేసులు(Corona Cases)పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Karimnagar: మెడికల్ కాలేజీలో కరోనా కలకలం...39 మందికి పాజిటివ్
కరీంనగర్‌లో కరోనా కలకలం
మెడికల్ కాలేజీలో 39 మందికి పాజిటివ్
కళాశాలకు సెలవులు ప్రకటించిన యజమాన్యం