హైదరాబాద్: కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు. దీంతో సామాజిక దూరం, మాస్క్ ధరించడం, లాక్డౌన్, రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న మార్గమని వైద్యులు సూచిస్తున్న ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని వైద్యులు నిరూపిస్తున్నారు.
Also read : ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
ఈ కష్ట కాలంలో కరోనా నుండి కోలుకొని వారి ప్లాస్మాను కరోనా రోగులకు ఇస్తే నయమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే వీరిలో కొంతమంది ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్న పరిస్థితుల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తన వంతు ప్రయత్నాలను కొనసాగించారు. కరోనా నుండి కోలుకున్న వారితో మాట్లాడానని దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ లకు లేఖలు రాశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..