Redmi 13 C 5G: అమెజాన్‌లో 5000 mAh బ్యాటరీ Redmi 13 C మొబైల్‌పై భారీ తగ్గింపు..రూ.600 లోపే పొందే సువర్ణ అవకాశం..

Get Redmi 13 C 5G Best Price: అమెజాన్‌లో Redmi 13 C స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:48 AM IST
 Redmi 13 C 5G: అమెజాన్‌లో 5000 mAh బ్యాటరీ Redmi 13 C మొబైల్‌పై భారీ తగ్గింపు..రూ.600 లోపే పొందే సువర్ణ అవకాశం..

Get Redmi 13 C 5G Best Price: మార్కెట్‌లో రెడ్ మీ స్మార్ట్ ఫోన్లకి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో లభించడం వల్ల బడ్జెట్ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కంపెనీ కూడా అతి తక్కువ బడ్జెట్‌లోనే కొత్త టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదల చేస్తోంది. గతంలో రెడ్ మీ కంపెనీ లాంచ్ చేసిన Redmi 13 C మోడల్ మార్కెట్‌లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఈ మొబైల్‌ను ప్రత్యేక తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ మొబైల్ పై అమెజాన్‌లో ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో Redmi 13 C స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 11,999కాగా అమెజాన్ ప్రత్యేక డీల్‌లో భాగంగా 33 శాతం తగ్గింపుతో రూ. 7,999కే లభిస్తోంది. దీంతోపాటు అదనంగా తగ్గింపు పొందడానికి వివిధ బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే.. రూ.150 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక అమెజాన్ వెబ్ సైట్ ను సందర్శించాల్సిన ఉంటుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్:
అమెజాన్ ఈ Redmi 13 C స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్ చీప్ ధరకే ఈ రెడ్ మీ కొత్త మొబైల్‌ను పొందవచ్చు. అయితే దీనికోసం ముందుగా చేయాల్సిందేంటంటే.. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాలి. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే బ్రాండ్ వ్యాల్యూ, మొబైల్ కండిషన్ బట్టి ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. మీ పాత మొబైల్ వ్యాల్యూ బాగుంటే రూ. 7,550 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.600లోపే పొందవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.74 అంగుళాలు డిస్ల్పే
720 x 1600 పిక్సెల్స్‌
ఆండ్రాయిడ్ 13, MIUI 14
Mediatek MT6769Z Helio G85 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU    
మాలి-G52 MC2 GPU
50 MP ప్రధాన కెమెరా
LED ఫ్లాష్, HDR
8 MP సెల్ఫీ కెమెరా    
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ 
Li-Po 5000 mAh బ్యాటరీ
డ్యూయల్ సిమ్

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News