Oppo F23 5G Smartphone: ఒప్పో F23 5G స్మార్ట్‌ఫోన్.. బ్యూటీఫుల్ సెల్ఫీ కెమెరా, కూల్ ఫీచర్స్

Oppo F23 5G Smartphone Price, Features: ఒప్పో ఎఫ్ సిరీస్ నుంచి ఒప్పో F23 పేరిట మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. క్వాల్ కామ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రాసెసర్‌తో పాటు కెమెరా ఫీచర్స్ ఇంకా అదిరిపోయాయి.

Written by - Pavan | Last Updated : May 15, 2023, 05:56 PM IST
Oppo F23 5G Smartphone: ఒప్పో F23 5G స్మార్ట్‌ఫోన్.. బ్యూటీఫుల్ సెల్ఫీ కెమెరా, కూల్ ఫీచర్స్

Oppo F23 5G Smartphone Price, Features: ఒప్పో ఎఫ్ సిరీస్ నుంచి ఒప్పో F23 పేరిట మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. క్వాల్ కామ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రాసెసర్‌తో పాటు కెమెరా ఫీచర్స్ ఇంకా అదిరిపోయాయి. వెనుక భాగంలో ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ 64MP మెయిన్ కెమెరా ఉండగా.. ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరా అమర్చారు. 

ఒప్పో F23 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి ఒకే ఒక్క వేరియంట్ తో లాంచ్ అయింది. అందులో 8GB RAM ఉండగా ఇంటర్నల్ స్టోరేజీ 256GB ఉంది. 

ఒప్పో F23 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ 28,999 గా నిర్ణయించగా.. లాంచింగ్ ఆఫర్ కింద ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా అమెజాన్ షాపింగ్ సైట్లో ఈ 5G ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ. 24,999 కే లభించనుంది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తించనున్నాయి. 

ఒప్పో F23 5G స్మార్ట్‌ఫోన్ కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. బోల్డ్ గోల్డ్ కలర్, కూల్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 

ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్ కొనాలనుకునే వారికి ఆర్థిక భారం పడకుండా సులభ పద్ధతిలో ప్రతీ నెల రూ.4,167 ఈఎంఐ చెల్లిస్తూ ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. 

ఫుల్ హెచ్‌డితో 6.7 అంగుళాల ఎల్సీడీ స్రీన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 91.4% స్క్రీన్ టు బాడీ రేషియోతో పాటు 240Hz టచ్ శాంపిలింగ్ రేట్ బాడీ రేషియో కలిగి ఉంటుంది. 

కలర్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిల్ 13 వెర్షన్ తో వస్తోంది. 8.2mm దళసరి మందంతో ఉండే ఈ ఫోన్ 192 కిగ్రా బరువు ఉంటుంది.  

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం 5,000mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ చార్జర్ అందిస్తున్నారు. ఈ పాస్ట్ చార్జర్ సహాయంతో కేవలం 18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.

కేవలం 5 నిమిషాలు చార్జిందగ్ చేస్తే చాలు 6 గంటల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చని.. యూట్యూబ్ లో 2.5 గంటల పాటు వీడియో వీక్షించ వచ్చు అని ఒప్పో కంపెనీ చెబుతోంది.

Trending News