IAA Leadership Awards: జీ సీఈవో, ఎండి పునీత్ గోయెంకాకు అంతర్జాతీయ గుర్తింపు, గేమ్ ఛేంజర్ అవార్డుతో సత్కారం

IAA Leadership Awards: జీ ఎండి మరియు సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ లీడర్‌షిప్ అవార్డ్స్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2022, 05:28 PM IST
IAA Leadership Awards: జీ సీఈవో, ఎండి పునీత్ గోయెంకాకు అంతర్జాతీయ గుర్తింపు, గేమ్ ఛేంజర్ అవార్డుతో సత్కారం

IAA Leadership Awards: జీ ఎండి మరియు సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ లీడర్‌షిప్ అవార్డ్స్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆ వివరాలు మీ కోసం..

జీ గ్రూప్ కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకాను ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ లీడర్‌షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో వెలకట్టలేని వ్యక్తిగత పాత్రకు ఈ అవార్డు లభించింది. వివిధ రంగాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ జీ సక్సెస్ స్టోరీకు కారణంగా నిలిచారనే క్రెడిట్ కూడా పునీత్ గోయెంంకాకు దక్కింది.

ఇది కేవలం ప్రోత్సాహం ఒక్కటే కాదని..ప్రగతి పధంలో ముందుకెళ్లేందుకు ఓ బలమైన సాధనమని..ఈ క్రెడిట్ మొత్తం అన్ని టీమ్స్‌కు దక్కుతుందని పునీత్ గోయెంకా తెలిపారు. వాటాదారుల విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విజయానికి కారణమైన ప్రతి ఒక్క జీ కుటుంబ సభ్యునికి ఈ విజయం అంకితమన్నారు. 

పునీత్ గోయెంకా సామర్ధ్యం

సంస్థ ప్రగతి, వ్యాపారంలో అభివృద్ధి కోసం నిర్దేశించిన లక్ష్యాల్ని సాధించడమే కాకుండా నాణ్యతతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అందిస్తూ..సమాజంలో పాజిటివ్ మార్పు తీసుకొచ్చేందుకు జీ సీఈఓ, ఎండీ పునీత్ గోయెంకా విశేష కృషి చేశారు. అతని భవిష్యత్ దృక్కోణం, తెలివితేటలతో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగంలో జీ అగ్రస్థానంలో ఉండేలా చేయడమే కాకుండా..అంతర్జాతీయ స్టేటస్ దక్కింది. పునీత్ గోయెంకా నేతృత్వంలో జీ విజయవంతంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశించి..190 దేశాల్లో నెట్‌వర్క్ కలిగి..1.3 బిలియన్ల వీక్షకుల్ని సంపాదించుకుంది. 

Also read: POCO F4 5G: పోకో ఎఫ్4 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.35 వేలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.9999కే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News