Visakha steel plant: అచ్చెన్నా..ఒళ్లు దగ్గర పెట్టుకో: మంత్రి అవంతి శ్రీనివాస్ వార్నింగ్

Visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Last Updated : Feb 16, 2021, 03:17 PM IST
Visakha steel plant: అచ్చెన్నా..ఒళ్లు దగ్గర పెట్టుకో: మంత్రి అవంతి శ్రీనివాస్ వార్నింగ్

Visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Visakha steel plant privatisation ) విషయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. స్ట్రీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగనే కారణమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు  వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందులో భాగంగా మంత్రి అవంతి శ్రీనివాస్ అచ్చెన్నాయుడికి ( Tdp mla Acham naidu ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని..ముఖ్యమంత్రి జగన్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. 

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ( Ysr congress party ) వ్యతిరేకమని..ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) ఈ దిశగా ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రెండు సార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు  ( Chandrababu ) ప్రధానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఆ బాధ్యత లేదా.. ప్రధానికి లేఖ రాసే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. దీక్షలు చేస్తున్న నేతలను ఎందుకు టీడీపీ నేతలు పరామర్శించలేదని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని అవంతి హితవు పలికారు. ఈ నెల 20న  స్టీల్‌ప్లాంట్‌ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని.. ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ( Minister Avanti srinivas ) పిలుపునిచ్చారు. 

Also read: Visakha steel plant issue: కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో సమావేశమైన ఏపీ బీజేపీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News