AP BRS Party Chief Thota Chandrasekhar Press Meet: బీఆర్ఎస్ పార్టీ దెబ్బకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దిగొచ్చిందని ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయంగా తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం స్పందించిన నేపథ్యంలో తోట చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేయగా బీఆర్ఎస్ పార్టీనే ఏపీ ప్రజలకి అండగా నిలబడింది అని తోట చంద్రశేఖర్ గుర్తుచేశారు. 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందాం. ఉక్కు ఉద్యమంలో 32 మంది అసువులు బాసారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవితాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు అని తోట పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి. జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా.. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశాం.. వారికి అండగా నిలబడ్డాం అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు అని ఇవాళ ప్రకటించారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని స్పష్టంచేశారు. బైలడిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారంకు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు.
ఇది కూడా చదవండి : KTR About Vizag Steel Plant: కేసీఆర్ మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందే
RINL విలువ రూ.3 లక్షల కోట్లు అయితే... వాళ్ళు చూపించింది రూ.397 కోట్లు మాత్రమే. అదాని ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే... బైలడిల్లా గనులను అదానికి కట్టబెట్టారు. బైలడిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి అని తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Minister Harish Rao: ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి.. వైసీపీ, టీడీపీలకు మంత్రి హరీష్ రావు చురకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK