మహారాష్ట్రలో వలస కూలీలు ఘటన, విశాఖలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరచిపోకముందే మరో ఘోరం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వలస కూలీలు దుర్మరణం చెందారు.
కరోనావైరస్ నివారణ కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు.
పాఠశాల అంటేనే చదువుల తల్లి సరస్వతి మాత నివాసం ఉండే దేవాలయంతో సమానం అని అంటారు పెద్దలు. కానీ ఓ ఊరిలోని గ్రామ పెద్దలు మాత్రం అదే పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించి పాఠశాలకు ఉండే పవిత్రను దెబ్బతీశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆ రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియాలంటే ఇదిగో ఈ స్మాల్ స్టోరీ చూడాల్సిందే.
ఢకియా రోడ్డుపై షాబాద్ మండలం బందర్ గ్రామం వద్ద బొలెరో వాహనం ఓ పెళ్లి బస్సు ఢీకొన్న ఘటనలో బొలెరోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఎక్కాలు కూడా రాని మాస్టార్ల చేతిలో రేపటి పౌరుల 'భవిష్యత్'.. ఈ విషయం గురించి మాటల్లో చెప్పడం కంటే.. దృశ్యరూపంలో చూస్తేనే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
చాలా ఏళ్ల క్రితం తమ కుటుంబంలో ఓ భాగమైన కాలు అనే శునకం చనిపోవడంతో ఆ శునకం ఆత్మశాంతి కోసం ఆ కుటుంబసభ్యులు 14 ఏళ్లుగా ప్రతీ ఏడాదికి ఆ శునకం చనిపోయిన రోజున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి బంధుమిత్రులకు అన్నదానం చేస్తోన్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో వెలుగుచూసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.